ఐటీ సోదాల పేరుతో మోసం.. అసలు విషయం ఏంటంటే..
పశ్చిమ బెంగాల్‌లోని ఛినార్ పార్క్ ప్రాంతంలో ఆదాయపు పన్ను అధికారుల పేరుతో నమ్మించి ఒక నగల వ్యాపారి కుటుంబాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం ఏమిటంటే వ్యాపారి కుమార్తె వినీతా సింగ్, ఆమె సవతి తల్లి అరతీసింగ్‌ల మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. దీనితో ఆస్తి దక్కించుకోవడానికి అరతీసింగ్ వేసిన ప్లాన్‌లో భాగంగా ఈ నకిలీ ఐటీ సోదాలు ఏర్పాటు చేసింది. కొందరు సీఐఎస్‌ఎఫ్ అధికారులు, బంధువులతో కలిసి ఈ సోదా జరిపించింది. 8 మందితో కూడిన బ్యాచ్ వారి ఇంట్లో సోదాలు జరిపి రూ.3 లక్షల నగదు, రూ.25 లక్షల బంగారం చేజిక్కించుకున్నారు. పైగా సీసీటీవీ ఫుటేజిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి పనులపై అనుమానం కలిగిన వినీతా సింగ్ పోలీసులను కలిసి ఐటీ సోదాలపై ఫిర్యాదు చేసింది. అయితే వారి విచారణలో ఐటీ సోదాలు జరగలేదని తెలియడంతో దీనిపై కేసు నమోదు చేసి, ప్లాన్ చేసిన ఆరతీ సింగ్‌తో పాటు వారందరినీ అరెస్టు చేశారు.

