Andhra PradeshHome Page Slider

రైతులు అప్పు చెల్లించలేదని టీవీలు, బైక్‌లు జప్తు

రైతులు అప్పు చెల్లించలేదని టీవీలు, బైక్‌లు ఎత్తుకెళ్లారు బ్యాంక్ అధికారులు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా చిప్పగిరి మండలం పేలడోనాలో చోటు చేసుకుంది. రైతులు అప్పు చెల్లించలేదని వారి వద్ద నుంచి బైకులు, ట్రాక్టర్లు, టీవీలు, ఇంట్లోని వస్తువులను బ్యాంక్ సిబ్బంది తీసుకెళ్లారు. బెల్డోణ బ్యాంక్‌లో గ్రామంలోని 130 మంది అప్పు తీసుకోగా తిరిగి చెల్లించలేదని 15 మంది వద్ద విలువైన సామాగ్రిని బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.