క్రికెటర్‌కు సీనియర్ హీరో క్షమాపణలు
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు చెప్పారు. రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్బంగా వార్నర్ గురించి మాట్లాడుతూ, ఎగతాళి చేసినట్లు అన్నాడని అతని అభిమానులు రాజేంద్రప్రసాద్‌పై మండిపడ్డారు. దీనితో ఆయన వివరణ ఇస్తూ దీనిపై ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా అతడిని ఏమీ అనలేదని, వార్నర్ అంటే తనకెంతో ఇష్టమని, కానీ సోషల్ మీడియాలో వచ్చిన భిన్నాభిప్రాయాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉందని పేర్కొన్నారు. అందుకే ఎవరినైనా బాధపెట్టినట్లు అనిపిస్తే క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు.