గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని మృతి
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెన్త్ ఎగ్జామ్స్ రాసి వస్తుండగా విద్యార్థిని మృతి చెందింది. పదో తరగతి పరీక్ష రాసి గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు ప్రభాతి ఛత్రియ అనే విద్యార్థిని తన అన్నయ్య సుమన్ తో పాటు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ మీద ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు కింద విద్యార్థిని ప్రభాతి ఛత్రియ (16) పడి అక్కడిక్కడే విద్యార్థిని మృతి చెందింది. ఛత్రియ అన్నయ్యకు గాయాలయ్యాయి. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్రియ TNGO కాలనీ లో నివాసం ఉంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.