Home Page SliderNationalNews AlertSports

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆద్యంతం అదరగొట్టి ఫైనల్స్‌లో కప్ సాధించిన టీమిండియా జట్టు విజయంపై బీసీసీఐ ఫిదా అయ్యింది. ఛాంపియన్స్‌గా అవతరించిన టీమ్‌కు భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.58 కోట్లను క్యాష్ రివార్డుగా ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిందని, ఒక్క ఓటమి కూడా లేకుండా కప్‌ను సొంతం చేసుకుంది. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది అందరూ ఈ రివార్డుకు అర్హులే. అంతర్జాతీయ వేదికలపై భారత క్రికెట్ ఉన్నతస్థానాలకు దూసుకెళ్తోందని ప్రశంసలు కురిపించారు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ,