Home Page SliderTelangana

ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గాంధారి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్ళుగా రవి పనిచేస్తున్నారు. రవితో పాటు మరో కానిస్టేబుల్ సుభాష్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఈ సమయంలో ఒక కారు అతి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. దీంతో కానిస్టేబుల్ రవి గాల్లో ఎగిరి పడి మృతి చెందాడు. కారును ముందుగానే గమనించిన సుభాష్ పక్కకి పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.