మీరు పుచ్చకాయను తింటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి…
చాలా మంది పుచ్చకాయను చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు దీనిని తినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. పుచ్చకాయలో దాదాపు 92% వాటర్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి దీనిని ముఖ్యంగా ఎండాకాలంలో తింటే మంచిది అని చెబుతుంటారు. కానీ పుచ్చకాయను తిన్న వెంటనే కొన్ని పదార్థాలు తినకూడదని మీకు తెలుసా?. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ తిన్న వెంటనే ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అనగా నాన్వెజ్ తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. చాలా మంది పుచ్చకాయని ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. మరియు టేస్ట్ కోసం దాని మీద ఉప్పు చల్లుకొని తింటుంటారు. దాని వాళ్ళ వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. ఉప్పు చల్లుకొని తినడం వలన హైబీపీ వచ్చే అవకాశం కూడా ఉంది.
రాత్రిపూట పడుకునే ముందు కూడా దీనిని తినకూడదు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన రాత్రుళ్ళు ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల నిద్ర భంగం కలుగుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. అదీకాక పుచ్చకాయను తిన్న వెంటనే గుడ్డు మరియు పాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.