పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు..
హైదరాబాద్‌లోని ‘పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ’ పేరు మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రరాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఆమరణ నిరాహార దీక్ష చేసి, పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం యూనివర్సిటీ పేరును అప్పటి పాలకులు నిర్ణయించారు. నేడు అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈ వర్సిటీ పేరును మార్పు చేయాలని ప్రతిపాదిస్తూ బిల్లు పెట్టారు. ‘పొట్టి శ్రీరాములు వర్సిటీ’ పేరును ‘సురవరం ప్రతాపరెడ్డి’ పేరుతో మార్పు చేయనున్నట్లు ప్రకటిస్తూ తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక’ నడిపిన జర్నలిస్ట్, రచయిత మరియు కవి. నిజాం అణచివేత పాలనను విమర్శించిన కవులలో ఆయన ప్రముఖులు.
ఈ విషయంపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిపాదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధన గడువు ముగిసిన తర్వాత పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలనే ప్రతిపాదన వచ్చింది, ఆ నిబంధన ప్రకారం హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.

