మద్యం మత్తులో యువకుల హల్ చల్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట భవానికుంట తండాకు చెందిన యువకులు మద్యం సేవించేందుకు ఓ బార్ షాప్ కు వెళ్లారు. అక్కడ మరో వర్గంతో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.