Breaking NewscrimeHome Page SliderInternational

9రోజుల్లో 9కోట్ల మంది స్నానాలు

ప్ర‌యాగ్‌రాజ్ వ‌ద్ద జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు ప్ర‌పంచ వ్యాప్తంగా 9 కోట్ల మంది హాజ‌రైన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.మేళా ప్రారంభ‌మైన రోజు నుంచి ఈ నెల 20 వ‌ర‌కు గ‌ల 9 రోజుల వ్య‌వ‌ధిలో 9 కోట్ల మంది పుణ్య‌స్నానాలు ఆచ‌రించార‌ని చెప్పారు.వివిధ దేశాల నుంచి త‌ర‌లివ‌చ్చి స్నానాలు ఆచ‌రించి మ‌హాకుంభ‌మేళాలో పునీతుల‌వుతున్నారు.మాజీ రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ దంప‌తులు ,ఆదానీ కుటుంబీకులు,అంబానీ కుటుంబీకులు,బాలీవుడ్‌,పాన్ ఇండియా సినీ స్టార్లు,క్రికెట‌ర్లు,ఇత‌ర స్పోర్ట్స్ ఐకానిక్ ప‌ర్స‌న్స్ ఇలా అన్నీ వ‌ర్గాల‌కు చెందిన సంప‌న్న శ్రేణి కుటుంబాల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ కుంభ‌మేళాలో పాల్గొంటున్నారు.144ఏళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే మ‌హా కుంభ‌మేళా కావ‌డంతో ఈ కుంభ‌మేళాకు విశేష ప్రాచుర్యం ల‌భించింది.దీంతో ఆది నుంచి అధిక ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో రెండు నెల‌ల ముందు నుంచే త్రివేణి సంగ‌మం వ‌ద్ద ఇన్స్టా టెంట్ హౌస్‌లు ఏర్పాటు చేసి వ‌స‌తుల‌ను అందుబాటులోకి తెచ్చారు.దీంతో ఏర్పాట్లు బాగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌ర‌గ‌డంతో దేశ‌,విదేశాల‌కు చెందిన 9 కోట్ల మంది ఈ 9 రోజుల్లోనే పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు.