Andhra PradeshHealthHome Page Slider

800 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గడచిన మూడు రోజులలో 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరు 3 రోజులుగా జ్వరం, కడుపునొప్పి, వాంతులు, డయేరియాతో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజులోనే 300 మందికి పైగా విద్యార్థులకు అనారోగ్యం సంభవించింది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలపై ఆరోపణలు చేస్తున్నారు. యాజమాన్యం ఆహారం, శుభ్రత విషయంలో శ్రద్ధ తీసుకోలేదని కంప్లైట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పేర్కొంది.