Andhra PradeshHome Page SliderNews Alertviral

నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల మహిళ..

ఏపీలోని కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె వయసు 72 ఏళ్లు. ఉత్సాహంగా తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్ టికెట్‌ను చెక్ చేయించుకుని ఉత్సాహంగా పరీక్ష రాయడానికి వెళ్లారు పోతుల వెంకటలక్ష్మి. ఈ వయసులో నీట్ పరీక్షకు ప్రిపేరయి, చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించారు. అయితే నీట్ 2025లో ఫిజిక్స్ పేపర్ చాలా కఠినంగా ఉందని, జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉండడంతో అభ్యర్థులు చాలా హైరానా పడ్డారని పేర్కొన్నారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నీట్ పరీక్షలు జరిగాయి.