Home Page SliderInternational

ఒకే ఒక్క బ్లడ్ టెస్ట్‌తో 60 జబ్బుల గుట్టు రట్టు

ఒక్క బ్లడ్ టెస్ట్‌తోనే 60 రకాల జబ్బుల ముప్పును కనిపెట్టగలిగే పద్దతిని కనిపెట్టారు క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు. ఈ పద్దతిలో 60కి పైగా జబ్బుల ముప్పును అంచనా వేయగలిగే ప్రొటిన్ సంకేతాలను కనిపెట్టారు. సాధారణంగా డాక్టర్లు తెలిసిన జబ్బులకు సంబంధించిన ప్రొటీన్లనే రక్తంలో పరీక్షిస్తారు. కానీ తాజా పరిశోధన ప్రకారం రకరకాల తెలియని జబ్బులను, లక్షణాలు తెలియక ముందే అంచనాలు వేయగలిగే  అవకాశం ఉంటుంది. ఈ పద్దతిలో అధునాతన పద్ధతుల సహాయంతో రక్తంలోని ప్లాస్మా ద్రవంలో ఉండే 20 వరకూ ఉన్న ముఖ్యమైన ప్రొటీన్లను శాస్త్రవేత్తలు కచ్చితంగా వర్గీకరించగలరు. వీటిలో మల్టిపుల్ మైలోమా, నాన్-హాడ్కిన్ లింఫోమా, గుండె కండరం వాపు, మోటార్ న్యూరాన్ డిసీజ్ వంటి రకరకాల జబ్బులను ముందుగానే అంచనా వేయవచ్చు.