‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రూ.6 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఈ బడ్జెట్‌లో అన్నదాతలకు పెద్దపీట వేస్తూ రూ.6,300 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.20,281 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.8,159 కోట్లు కేటాయించారు.

