6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఏపీ కుర్రాడు సంచలనం
క్రికెట్‌లో గెలుపు ఓటములు ఎలా మారతాయో ఊహించడం కష్టం. పటిష్టంగా ఉన్న టీమ్ అమాంతంగా చిత్తవుతుంది. చిత్తవుతుందనుకున్న టీమ్ అమాంతంగా సక్సెస్ అవుతుంది. క్రికెట్‌లో రికార్డులు కూడా కొన్ని సార్లు సంచలనంగా నిలుస్తుంటాయి. అందులో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం అరుదైన విషయం. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌పై యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్సర్లను ఎవరు మర్చిపోలేరు. వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ ఒక ప్రధాన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి. 1968లో నాటింగ్‌హామ్‌షైర్‌కు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న గార్ఫీల్డ్ సోబర్స్ గ్లామోర్గాన్ ఆటగాడు మాల్కం నాష్‌పై ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 1985లో బరోడాపై బాంబే తరఫున ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రవిశాస్త్రి నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ హర్షల్ గిబ్స్. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వంశీ కృష్ణ కూడా చేరాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. కల్నల్ CK నాయుడు ట్రోఫీ అనేది U-23 క్రికెటర్లకు జాతీయ టోర్నమెంట్. కడపలో జరిగిన కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో 64 బంతుల్లో 110 పరుగులతో సత్తా చాటాడు. రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ ఓవర్లో వంశీ కృష్ణ ఓ ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు” అని బిసిసిఐ తన పోస్ట్‌లో రాసింది. వీడియోను షేర్ చేసింది.

