త్వరలో ప్రధాన నగరాలలో 5జీ సేవలు
భారతమార్కెట్లో 5జీ సపోర్ట్ స్మార్ట్ ఫోన్‌లు త్వరలో సందడి చేయనున్నాయి. ఊహించిన దానికంటే చాలా ముందుగానే ప్రముఖ టెలికాం కంపెనీలు రిలయన్స్, జియో, ఎయిర్ టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. సాంకేతిక విప్లవం వేగంగా అభివృద్ధి చెందడానికి త్వరలోనే 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రధాని మోదీ తెలియజేసారు. 4జీ కంటే 5జీ స్పీడ్ 10రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొదటిగా ఈసేవలు హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, చండీఘర్, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలలో రాబోతోంది. తర్వాత చిన్ననగరాలకు కూడా విస్తరించబోతోంది. గతంలో 4జీ సేవలు ప్రారంభించినప్పుడు కూడా మొదట ప్రధాన నగరాలలో ప్రారంభించి తర్వాత చిన్న నగరాలకు, ఊర్లకు విస్తరించారు. ఇప్పుడు కూడా ఇదే పద్దతిని అనుసరించబోతున్నారు. ఇప్పటికే భారత మార్కెట్లో 5జీ సపోర్ట్ ఫోన్‌లు వాడకం మొదలైంది.
Read more: ఓల్డ్ సిటీలో భారీగా పోలీసులు

