రెండు వారాల్లో 57 మందిపై కేసులు
ఏపిలో అరాచక పాలన సాగుతోందని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.కేవలం రెండు వారాల వ్యవధిలో తమ పార్టీకి చెందిన 57 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.ఇందులో 12 మందిని మాత్రమే అరెస్ట్ చూపారని, మరో 14 మంది ఆచూకీ కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారిని గంట గంటకు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఇదే సంసృతి భవిష్యత్ లో మేమొచ్చాక పునరావృతం అయితే తట్టుకోలేరని హెచ్చరించారు. ఈ ఘటనలన్నింటిపైనా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కి ఫిర్యాదు చేశామన్నారు.