లగచర్ల కేసులో 55 మంది అరెస్ట్
ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియ,కంపెనీ నిర్మాణ సాధ్యాసాధ్యాల పరిశీలకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్,సంబంధిత అధికారులపై దాడి కేసులో 55 మంది ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.లగచర్ల,పులిచర్ల,రోటిబండ ప్రాంతాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించి పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. లగచర్ల గ్రామస్థులతో చర్చల కోసం సోమవారం పర్యటించిన కలెక్టర్ ప్రతీక్ బృందంపై గ్రామస్థులు రాళ్లతో ,కర్రలతో దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు వీరందరిని అరెస్ట్ చేశారు.

