Home Page SliderInternationalviral

మనవరాలికి జన్మనిచ్చిన 52 ఏళ్ళ మహిళ

మాతృత్వం అనేది ఒక వరం. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది, ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది అనేది అతిశయోక్తి కాదేమో. అలాంటి ఒక తల్లి తన కూతురి కోసం తన 52 ఏళ్ళ వయసులో తన ప్రాణాల్ని పణంగా పెట్టింది.
52 ఏళ్ల క్రిస్టి ష్మిత్, గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతున్న తన కుమార్తె హైడీకి సరోగేట్ తల్లిగా మారింది. కాలిఫోర్నియాలో నివాసముండే హైడీ మరియు జాన్ లకు 2015 లో వివాహం జరిగింది. ఆ తరువాత 2020 లో హైడీ గర్భం దాల్చింది. అంతే కాదు వారికి కవలలు అని తెలిసి చాలా సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువ సమయం లేకుండపోయింది. 2 వారాల వ్యవధితోటి ఒకరితరువాత ఒకరు కడుపులోని పిల్లలు చనిపోయారు. టెస్టుల అనంతరం హైడీకి గర్భంలో సమస్య ఉంది, ఒకవేళ తాను గర్భం దాలిస్తే తనకి ప్రమాదం అని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. దానితో ఆ దంపతులు కుమిలిపోయారు. తన బిడ్డ బాధ పడుతుంటే ఏ తల్లి చూడగలదు. అలానే క్రిస్టి ష్మిత్ తన బాధ చూడలేక తన కూతురి యొక్క బిడ్డకి సరోగేట్ మదర్ కావడానికి రెడీ అయ్యింది. అన్ని టెస్టులు చేపించుకొని డాక్టర్స్ ఓకే అన్న తరువాత చుట్టుపక్కలవాళ్ళు ఎన్ని అంటున్న కూడా 2022 న తన మనవరాలికి జన్మనిచ్చింది. ఇందుకు తన భర్త అయిన Ray తనకి ఎంతో సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఆ పాపకి 3 సంవత్సరాలు.