“సన్నవడ్ల కు 500 రూపాయల బోనస్”..రేవంత్ రెడ్డి
సన్నవడ్ల కు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఐకేపీ సెంటర్లు ఉండాలి. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సన్నవడ్ల పై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన లు చేయాల్సిందే. తాలు ,తరుగు,తేమ పేరు తో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలి. వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో ఏర్పాట్లు చేయాలి. ప్రతి రోజు కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష జరపాలి. ధాన్యం కొనుగోళ్ల పైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలో కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.