Andhra PradeshHome Page SliderPolitics

ఏపీలో వారికి 50 శాతం సబ్సిడీ రుణాలు..

ఏపీ ప్రభుత్వం బీసీ, ఈబీసీ కేటగిరీ వ్యక్తులకు బిజినెస్ రుణాలు సబ్సిడీపై ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. స్వయం ఉపాధికోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తారు. వీటికోసం 12వ తేదీ వరకూ దరకాస్తులు చేసుకోవచ్చు. లబ్దిదారులు ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని మంత్రి సబిత తెలిపారు. కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, ఫోటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీ పార్లర్లు వంటి యూనిట్లకు రూ.2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకూ రుణాలు ఇస్తారు. వీటిలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే వారు తీసుకున్న రుణంలో 50 శాతం కడితే సరిపోతుంది. లబ్దిదారుల వయసు 21 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షికాదాయం పట్టణాలలో రూ.1.30 లక్షలు, గ్రామాలలో రూ.81 వేల లోపు ఉండాలి. రేషన్ కార్డులో కుటుంబంలో  ఒక్కరు మాత్రమే ఈ రుణాలకు అర్హులు. వైట్ రేషన్ కార్డులు, కుల, వయసు ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ రుజువులుగా చూపించాల్సి ఉంటుంది.  బీసీలకు రూ.896 కోట్లు, ఈబీసీలకు రూ.384 కోట్లు ఈ రుణాల కోసం కేటాయించారు.