ఎయిర్ పోర్ట్‌లో ధర్నా చేస్తున్న 45 మంది ప్రయాణీకులు
తిరుపతి (రేణిగుంట) నుంచి బయలుదేరాల్సిన ఓ ఫ్లైట్ ని కనీసం సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడంతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న 45 మంది ప్రయాణీకులు ఏకంగా ఎయిర్ పోర్ట్‌లోనే ధర్నాకు దిగారు.ఎయిర్ లైన్స్ కి చెందిన విమాన సర్వీసు మంగళవారం ఉదయం హైద్రాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 7.15కి వచ్చింది.తిరిగి హైద్రాబాద్ కి 8.15కి బయలుదేరాలి.అందులో ప్రయాణించేందుకు 45 మంది సిద్దంగా ఉన్నారు.అయితే ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీస్ ని రద్దు చేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు .దీంతో రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో ఉద్రిక్తత నెలకొంది.