హైదరాబాద్‌లో ఏటా 40వేల కిడ్నీ వ్యాధి కేసులు
దేశంలో మరణాలకు కారణమవుతున్న ప్రమాదకర వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఆరో స్థానంలో ఉంది. ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్ గురువారం వెల్లడించింది. హైదరాబాద్ పరిధిలో ఏటా 40 వేల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అంచనా వేసింది. వీరిలో 30 శాతం మంది వరకు కూడా డయాలసిస్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వీరందరికీ కారణం హైబీపీ, మరి కొంతమందిలో డయాబెటిస్, కిడ్నీలలో రాళ్లూ రావడంతో కిడ్నీలు పాడైపోవడం లాంటి కారణాలు ఎక్కువ. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరగడానికి కారణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించకపోవడమేనంటున్నారు వైద్యులు.