టోల్‌గేట్ వద్ద తనిఖీలో 4.3 కిలోల బంగారం లభ్యం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం వద్ద ఉన్న టోల్ గేట్ వద్ద భారీగా బంగారం లభ్యమయ్యింది. పోలీసుల సాధారణ తనిఖీలో 4.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిని బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక కారులో ఈ బంగారాన్ని ఒక దుకాణానికి చెన్నై నుండి నెల్లూరుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.3.38 కోట్లు ఉండవచ్చని అంచనా. బంగారం దొరికిన కారును సీజ్ చేశారు.


 
							 
							