3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కని 39 మంది
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 3 లక్షల నుండి 6 లక్షల మెజార్టీతో గెలిచిన 39 మందిని పక్కనపెట్టింది. వారిలో సంజయ్ భాటియా (కర్నాల్), రంజనాబెన్ (వడోదరా), పర్వేష్ (పశ్చిమ ఢిల్లీ), హన్స్‌రాజ్ (వాయవ్య ఢిల్లీ), అనంతకుమార్ (ఉత్తర కన్నడ) మొదలైన వారున్నారు.