రాష్ట్రంలో రేపటి నుంచే 33 పత్తి కొనుగోలు కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపటినుంచి ప్రారంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలని సూచించారు.
2025–26 సంవత్సరానికి రాష్ట్రంలో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని, దాంతో 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రతి క్వింటాల్ పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ₹8,110ను రైతులకు చెల్లించాలన్నారు. పత్తి అమ్మకాల సమయంలో రైతులు కూడా నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు.

