31 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
కర్నూలు జిల్లా పోలీసులు పేకాట శిబిరం పై మెరుపు దాడులు నిర్వహించారు.బుధ్వార్ పేట్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పేకాట ఆడుతున్న 31 మంది పేకాట రాయుళ్లను వలపన్ని పట్టుకున్నారు.వీరి నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. 40 సెల్‌ఫోన్లు,2 లగ్జరీ కార్లు, రూ.31లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.