రూ.300 కోట్లు కాజేసిన ఘనులు అరెస్ట్
బై బ్యాక్ పాలసీని బేస్ చేసుకుని ఏకంగా రూ.300 కోట్ల మేర డిపాజిట్లు రాబట్టిన ఘరానా మోసగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సంస్థ ఎండి వపన్ కుమార్ ని అరెస్ట్ చేశారు.ఆయనతో పాటు మరో 7 గురిని కూడా ఈవోడబ్ల్యూ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. రూ.10లక్షలు పెట్టుబడితే చాలు బై బ్యాక్ చేసి రూ. 20లక్షలు ఇస్తామని నమ్మబలికి తీరా కస్టమర్లను దారుణంగా మోసం చేశారు. అరెస్ట్ నేపథ్యంలో బాధితులు పెద్ద ఎత్తున సైబరాబాద్ చేరుకున్నారు.నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.