అర్హులైన 2,62,169 మంది కొత్త లబ్ధిదారులకు రూ. 216.34 కోట్లు విడుదల
అర్హులైందరికీ 100 శాతం లబ్ధి చేకూర్చడమే మన ప్రభుత్వ ధ్యేయం
జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం ద్వారా 14,035 మంది వేల అర్హుల గుర్తింపు
అధికారమంటే అజమాయిషి కాదు..ప్రజల పట్ల మమకారం చూపడం
నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ వ్యాఖ్యలు
“అధికారం అంటే అజమాయిషి చేయడం కాదు..అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం. అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యత అని రుజువు చేస్తూ గత అరు నెలలుగా జరిగిన వివిధ పథకాలు, కార్యక్రమాల్లో వివిధ సాంకేతిక కారణాలతో పథకాలు అందుకోలేకపోయిన 2.62 లక్షల మంది అర్హులకు మరొక్కసారి అవకాశం కల్పిస్తున్నాం. ఈ రోజు రూ.216.34 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం” – సీఎం జగన్
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం ద్వారా సర్టిఫికెట్లు పొందిన అర్హులందరికీ సంక్షేమ పథకాలు పక్కాగా అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులైన ఎవరూ ఏ కారణం చేతనైనా లబ్ధి అందకుండా ఉండిపోరాదన్న ధృడ సంకల్పం మన ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. డిసెంబర్, 2022 నుండి జూలై, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంచేతైనా లబ్ధి అందని 2,62,169 మంది అర్హులకు రూ. 216.34 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ చేశారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ది అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ ఏటా రెండు సార్లు లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు.
అర్హులై ఉండి సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు, ఆయా పథకాల లబ్ధి అందించిన నెలలోపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వెరిఫికేషన్ అనంతరం ఆరు నెలలకోసారి అర్హులైన నూతన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి, పారదర్శకతతో లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా, అర్హులందరికీ మన ప్రభుత్వంలో లబ్ధఇ చేకూరుతోందన్నారు. నేడు విడుదల చేసిన లబ్ధితో కలిపి 4 పర్యాయాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను రూ. 1,647 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమచేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు జగనన్న ప్రభుత్వం నేడు అందిస్తున్న పథకం వారీగా నగదు లబ్ధి పూర్తి వివరాలు!..
- జగనన్న చేదోడు – లబ్దిదారుల సంఖ్య – 43,131 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 43,13,10.000
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం – లబ్దిదారుల సంఖ్య – 8,753 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 13,12,95.000
- వైఎస్సార్ నేతన్న నేస్తం – లబ్దిదారుల సంఖ్య – 267 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 64,08.000
- వైఎస్సార్ మత్స్యకార భరోసా – లబ్దిదారుల సంఖ్య – 207 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 20,70.000
- జగనన్న అమ్మ ఒడి – లబ్దిదారుల సంఖ్య – 14,836 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 22,25,40.000
- జగనన్న విద్యా దీవెన – లబ్దిదారుల సంఖ్య – 32,770 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 26,66,00.000
- జగనన్న వసతి దీవెన – లబ్దిదారుల సంఖ్య – 36,898 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 32,13,00.000
- వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు మరియు ఇన్పుట్ సబ్సిడీ – లబ్దిదారుల సంఖ్య – 1,08,590 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 42,16,94.000
- వైఎస్సార్ ఆసరా – లబ్దిదారుల సంఖ్య – 16,717 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 36,01,56.051
- మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,169, అందిస్తున్న నగదు లబ్ధి రూ. 216,33,73,051
జగనన్న సురక్షతో కొత్తగా 12,405 మంది లబ్ధిదారుల గుర్తింపు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడపట్టి అవసరమైన వారికి 94,62,184 సర్టిఫికెట్ల జారీ చేస్తూ అర్హులైన 12,405 మంది కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ విడతలో సంక్షేమ పథకాలు అందించినట్లు సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించడం ద్వారా కొత్తగా అర్హులైన 1,630 మందికి కూడా ఈ విడతలో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో కొత్తగా (డిసెంబర్ 2022 – జూలై 2023 వరకు) అర్హులైన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కింద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 50 నెలల్లో లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో (DBT రూపంలో) రూ.2.33 లక్షల కోట్లు అందించినట్లు తెలిపారు.
నాడు జన్మభూమి కమిటీల లంచాల పర్వం.. నేడు పారద్శకంగా పథకాలు
గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇచ్చి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని నాటి ప్రభుత్వం మొత్తం జన్మభూమి కమిటీల లంచాల పర్వం సాగగా.. నేడు మన ప్రభుత్వంలో పారద్శకతతో పథకాలు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మనది మనసున్న ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని మన రైతు, మహిళా పక్షపాత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కాగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వ జన్మభూమి కమిటీల ద్వారా అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేవని పథకాల అమలులో లంచాలు, వివక్ష.. వీలైనంత మందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలని కుతంత్రాలు.. గ్రామానికి ఇంతమందికే లబ్ది అనే కోటాలు, కోతలు.. ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి అవకాశం అనేలా పాలన సాగిందని సీఎం జగన్ వివరించారు. కానీ మన ప్రభుత్వంలో నేడు కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు.. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని కూడా ఇస్తూ.. ప్రతి ఏటా రెండు పర్యాయాలలో లబ్ధి అందజేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి, నిర్దిష్ట సమయంలోనే ఠంచన్ గా లబ్ధిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

