International

26 ఏళ్లకే మంత్రి పదవి

26 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి అందిరి దృష్టిని ఆకర్షిస్తోంది రోమినా పౌర్నోఖార్తి. కొత్తగా ఏర్పాటైనా స్వీడన్ ప్రభుత్వంలో ఈమె ఈ పదవిని దక్కించుకున్నారు. అతి పిన్న వయస్సులో పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ స్వదేశమైనా స్వీడన్‌లో రోమినా యువ మంత్రిగా పనిచేయనుండటం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం రోమినా లిబరల్ పార్టీ యూత్‌వింగ్ అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. నూతన ప్రధానిగా ఎన్నికైన ఉల్ఫ్ క్రిస్టిర్‌సన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కేబినేట్ సభ్యులు ఆమె పేరును మంత్రి పదవికి ప్రతిపాదించారు. స్వీడన్ డెమొక్రాట్లతో కలిసి నడిచేందుకు గతంలో క్రిస్టర్‌సన్ తీసుకున్న చర్యల్ని రోమినా బహిరంగంగా విమర్శించారు. తన సొంత పార్టీ నేత అయినప్పటికి  రోమినా , క్రిస్టర్‌సన్‌ కు చురకలంటించేవారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా తనకు మంత్రి పదవిని ఇవ్వడంపై రోమినా హర్షం వ్యక్తం చేశారు. తాను ఎన్ని విమర్శలు చేసిన వాటిని పాజిటివ్‌గా తీసుకొని మంత్రి వర్గంలోనికి ఆహ్వానించిన క్రిస్టర్‌సన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.