Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTrending Todayviral

అమీర్‌ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు…

బాలీవుడ్ మిస్టర్ పర్‌పెక్ట్ అమీర్ ఖాన్ ఇంటిని 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన నివాసానికి వీరంతా బస్సులు, వ్యాన్లలో హఠాత్తుగా చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ అమీర్ ఖాన్ టీమ్‌ను సంప్రదించింది. అయితే వారి స్పందన అంత స్పష్టంగా లేదు. మేమూ ఇంకా ఆరా తీస్తున్నాం. అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ప‌రిణామాల వెన‌క నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఇతర కథనాల ప్రకారం, అధికారులు అమీర్ ఖాన్‌ను కలవడానికి వచ్చారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది నిజమే అయితే, ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గురించే చర్చ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అమీర్ ఖాన్ త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) కు చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆగ‌స్ట్ 14 నుండి 24 వ‌ర‌కు ఈ వేడుకని గ్రాండ్‌గా నిర్వహించ‌నున్నారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన నటించిన క్లాసిక్ సినిమా ‘తారే జమీన్ పర్’ ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ వేదికపై అమీర్ కొత్త ప్రాజెక్టులని ప్రకటించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.