నేతన్న నేస్తంతో 24 వేల ఆర్థిక సాయం
ఇవాళ వైఎస్సార్ నేతన్న హస్తంతో చేనేత కార్మికులకు జగన్ సర్కారు ఆర్థిక సాయం చేయనుంది. సొంత మగ్గం కలిగి ఉండి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న జగన్ సర్కారు… వరుసగా నాలుగో ఏడాది పథకాన్ని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 80,546 కుటుంబాలకు ఇవాళ సీఎం జగన్ 24 వేల చొప్పున మొత్తం రూ. 193.31 కోట్లను వారి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రోజు రోజుకు దిగజారుతున్న చేనేతల జీవనస్థితిగతులకు సర్కారు అందిస్తున్న సాయం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. తాజా సాయంతో… జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఒక్కో చేనేత కుటుంబానికి నాలుగేళ్లలో 96 వేల రూపాయల సాయం అందిందనట్టవుతుంది. కృష్ణా జిల్లా పెడనలో ఉదయం 11 గంటలకు బటన్ నొక్కి లబ్ధిదారుల ఎకౌంట్ల నగదు జమ చేస్తారు సీఎం జగన్.
