కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు యాక్సిడెంట్ నేపథ్యంలో 22 రైళ్లు దారి మళ్లింపు
కాంచనజంగ రైలు యాక్సిడెంట్ అనంతరం ఆ మార్గంలో రైల్వే సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే ఆ దారిలో వెళ్లవలసిన 22 రైళ్లను 26 కిలోమీటర్లమేర దారి మళ్లించినట్లు రైల్వే వర్గాలు తెలియజేశాయి. జూన్ 17న జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. 22 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం రంగపాణి-ఛత్తర్‌హట్ సెక్షన్లో కతిహార్ డివిజన్‌లో జరిగింది. ఈ మార్గంలో నడిచే న్యూడిల్లీ-దిబ్రూ రాజధాని ఎక్స్‌ప్రెస్, సిల్చర్-సియాల్‌దా ఎక్స్‌ప్రెస్‌లు కూడా 26 కిలోమీటర్ల మేర దారి మళ్లింపబడుతున్నాయి.