Home Page SliderNational

కల్తీ మద్యం తాగి 21 మంది మృతి

పంజాబ్‌లో సంగ్రూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.