పాక్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
పాకిస్తాన్‌లోని కరాచీలోని బచా జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుని పరార్ అయ్యారు. ఇక్కడ సంభవించిన భూకంపం వారికి కలిసి వచ్చింది. జైలులో గోడ కూలిపోవడంతో సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని మరీ పరార్ అయ్యారు. ఈ ఘటనలో పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాల పాలయ్యారు. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ కావడంతో పాక్ లో కలకలం రేగింది.