ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. అక్కడి మాధ్ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు బస చేసినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నేటి ఉదయం నుండి నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలలో డీఆర్జీ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 20 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లు బలగాలు పేర్కొన్నాయి.