కత్తులు తుపాకులతో బెదిరించి 2.5కిలో బంగారం చోరీ
హైద్రాబాద్‌కి గుండెకాయ లాంటి దోమలగూడ ప్రాంతో సినీ ఫక్కీ తరహాలో భారీ చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజిత్ గోరాయి అతని సోదరుడితో కలిసి దోమలగూడలోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటూ కింద పోర్షన్‌లో బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు.ఇరువురు కుటుంబాలు ఇదే కాలనీలో ఉంటున్నాయి. ఈ నెల 12న తెల్లవారుజామున 3 గంటలకు కార్ఖానా నుంచి ఇంటికి వచ్చాడు రంజిత్. ఇదే సమయంలో ముసుగు ధరించిన పదిమంది గుర్తు తెలియని దుండగులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. భార్య మిత, ఇద్దరు పిల్లలను కత్తులతో బెదిరించి వారి చేతులను తాళ్లతో వెనక్కి కట్టి బంగారం ఎక్కడ దాచారో తీయమంటూ దాడి చేశారు.ఇంద్రజిత్‌ను తీవ్రంగా కొట్టి భార్య మెడలోని బంగారు గొలుసు మూడు సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌ను లాక్కున్నారు. అనంతరం అదే ఇంటి ముందు పోర్షన్‌లో నివసిస్తున్న ఇంద్రజిత్ సోదరుడు రంజిత్ గోరాయి ఇంటికి వెళ్లారు. తలుపు తెరవకపోవడంతో ఇంద్రజిత్ తలపై తుపాకీ పెట్టి తలుపు తెరవపోతే అతన్ని అంతం చేస్తామని రంజిత్‌ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురై తలుపు తెరిచాడు.రంజిత్‌తో పాటు కుమార్తె మెడపై కత్తులు పెట్టి లాకర్ తెరవమని అతని భార్యను బెదిరించారు. ఆందోళనకు గురైన ఆమె లాకర్ తెరిచింది. దీంతో దుండగులు లాకర్‌లో ఉన్న 2.50 కిలోల ఆభరణాలు రింజిత్ భార్య అనిత మెడలో ఉన్నమంగళసూత్రాన్ని కూడా అపహరించి కారులో అక్కడ నుంచి హుడాయించారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు బాధితులు.జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

