2లక్షల కోళ్ళు మృతి…ఎలా జరిగిందంటే?
ఉభయ గోదావరిని ఫ్లూ వైరస్ వణికిస్తుంది.బర్డ్ ఫ్లూ ప్రతీ ఒక్కరికి తెలిసిన వ్యాధే అయినప్పటికీ ..అది పదేళ్లకోసారి ఇలా విరుచుకుపడుతుంటుంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పలు గ్రామాల్లో ఈ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.కోళ్ల ఫారాలు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఫౌల్ట్రీలన్నీ మృతి చెందిన కోళ్లతో కంపుకొడుతున్నాయి.గత 15 రోజుల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి శరవేగంగా విస్తరించడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.కొల్లేరు సరస్సు నుంచి వచ్చిన వలస పక్షుల వల్లే ఈ వైరస్ సోకిందని భావిస్తున్నారు.ఫారాలలో జీవ భద్రతా చర్యలు సరిగ్గా చేపట్టకపోవడం,చనిపోయిన కోళ్లను విధిగా ఖననం,లేదా దహనం చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందింది.ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఖననం చేసే ఒక్కో కోడికి రూ.90ల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పటికీ నిర్వాహకులు భయంతో ముందుకు రాకపోవడంతో వ్యాధి విస్తృతిపై భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

