తెలంగాణలో దసరాకు 16 రోజులు సెలవులు మరి ఏపీలో?
తెలంగాణలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి దసరా నవరాత్రి ఉత్సవాలకు 16 రోజులపాటు సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో అత్యంత్య వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలకు మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 230 రోజులు పాఠశాల పనిదినాలు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు). అలాగే ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు సెలవులు రానున్నాయి.
జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు. వేసవి సెలవులు ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు. ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు

ఏపీలో దసరా సెలవులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో దసరా సెలవుల గురించి ముందునే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, వేసవి సెలవులతో కలిపి మొత్తం 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ విద్యాసంవత్సరం సెలవులు ఇవే..
ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు మాత్రం దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇవ్వనున్నారు. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

