దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 15 రైళ్లు మూడు రోజులపాటు రద్దు
రైల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారా..ఒక్కక్షణం ఆగి రద్దయిన ట్రైన్‌లలో మీ రైల్ ఉందేమో చూసుకోండి. నేటినుండి మూడు రోజుల పాటు ఏకంగా 15 రైళ్లను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. ఈ రోజు నుండి 12 వ తేదీ వరకూ నిర్వహణ పరమైన కారణాలతో 15 రైళ్లు రద్దయ్యాయి. వాటిలో సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, మధిర, కాకినాడ, విశాఖపట్టణం మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ఈరోజు రేపట్లో 13 రైళ్లు రద్దయ్యాయి. 11న సికింద్రాబాద్- మధిర మధ్య నడిచే రైలు, 12న మధిర- సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసారు. వీటిలో కాకినాడ-విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
