12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీస్- పోలవరానికి రూ.12,500 కోట్లు
ఏపీ, తెలంగాణ, బీహార్, పంజాబ్లలో పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలు లబ్ది పొందుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. వీటికోసం రూ. 28,602 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలు అభివృద్ధి చేస్తామని, దీనికోసం రూ.2,137 కోట్లు ఖర్చు పెడుతున్నామని, దీనితో 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రమంత్రి అశ్వినికుమార్ వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కూడా 2,621 ఎకరాలలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ,45 వేలమందికి ఉపాధి లభిస్తుంది.
తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఎంపికయ్యాయి. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలోని పోలవరానికి రూ.12,500 కోట్లు మంజూరయ్యిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.