Andhra PradeshBreaking NewscrimeHome Page SliderTelangana

ఎన్టీఆర్ జిల్లాలో 12ల‌క్ష‌ల కోళ్లు మృతి

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కే ప‌రిమిత‌మైన బ‌ర్డ్ ఫ్లూ…ఇప్పుడు సెంట్ర‌ల్ ఆంధ్రాని తాకింది. ఎన్టీఆర్ జిల్లా గంప‌ల‌గూడెంలో లో ఉన్న ఫౌల్ట్రీల్లో ఉన్న దాదాపు 12ల‌క్ష‌ల కోళ్లు మృత్యువాత ప‌డ్డాయి.ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 18 ల‌క్ష‌ల కోళ్లు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు,ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారులు తెలిపారు.చనిపోయిన కోళ్ల‌ను వెలికి తీసి ఖ‌ననం చేసేందుకు ప్ర‌త్యేక ర్యాపిడ్ టీంని ఏర్పాటు చేశారు.తెలంగాణ ,ఏపి బోర్డ‌ర్‌లో ఉన్న తిరువూరు స‌హా ఈ జిల్లాలోకి ఏ ఇత‌ర ప్రాంతాల నుంచి కోళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌రాద‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.కొద్ది రోజుల పాటు కోళ్లు,గుడ్లు తిన‌కుండా ఉండ‌ట‌మే మేల‌ని సూచిస్తున్నారు వైద్యులు.