గత పదేళ్లలో భారత్‌లో 12.5 కోట్ల ఉద్యోగాల కల్పన
గత పదేళ్ల కాలంలో భారత్‌లో 12.5 కోట్ల ఉద్యోగాలు సృష్టి జరిగినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. దేశంలో పదేళ్లలో అనేక రంగాలలో అభివృద్ధి జరిగిందని వెల్లడించింది. మాన్యుపాక్టరింగ్, సర్వీస్ రంగాలలో ఈ సంఖ్య బాగా పెరిగింది. అలాగే ఎంఎస్‌ఎంఈలలో కూడా రిజిష్టర్ అయిన ఉద్యోగాల సంఖ్య 20 కోట్లు దాటినట్లు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి.

2004-05 ఆర్థిక సంవత్సరం నుండి 2013-14 మధ్యలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి మాత్రమే జరిగింది. అయితే 2013-14 నుండి 2023-24 మధ్య పదేళ్ల కాలంలో 12.5 కోట్ల ఉద్యోగాలు సృష్టి జరిగింది. మాన్యుపాక్టరింగ్, సర్వీస్ రంగాలలో ఈ సంఖ్య 6.6 కోట్ల నుండి 8.9 కోట్లకు పెరిగింది. ఈ ఉద్యోగాల కల్పనకు గత పదేళ్లలో ప్రధాని మోదీ అవలంభించిన ఆర్థిక విధానాలే కారణంగా తెలుస్తోంది. భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పన, విదేశీ పెట్టుబడులు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు దేశంలో పెరగడం వంటి కారణాలతో ఉద్యోగాలు పెరిగాయి.

