NationalNews Alert

లోయలో పడ్డ మినీ బస్సు 11 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

సంఘటన స్థలంలో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

సంఘటన గురించి తెలియాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారణ వ్యక్తం చేశారు. J&K లెఫ్టినెంట్ గవర్నర్, మనోజ్ సిన్హా, ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు