Breaking NewsHome Page Slider

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. కాగా ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం 3,449 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణాలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయినట్లు తెలుస్తోంది. కాగా వీరి కోసం తెలంగాణాలో 2,652 పరీక్ష కేంద్రాలను  అధికారులు ఏర్పాటు చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్ష హాలుకు రావాలని అధికారులు సూచించారు.