104 ఏళ్ల వయస్సులో స్కై డైవింగ్ చేసిన బామ్మ మృతి
అమెరికాలోని షికాగోకు చెందిన డొరొతీ హాఫ్‌మన్ 104 ఏళ్ల వయస్సులో స్కై డైవింగ్ చేశారు. కాగా ఆమె వారం రోజుల క్రితం 4100 మీటర్లు ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా స్కై డైవింగ్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఈ 104 ఏళ్ల బామ్మ గిన్నిస్ రికార్డ్ పత్రాన్ని అందుకోకుండానే తుదిశ్వాస విడిచారు. కాగా స్కై డైవింగ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆమె మరణించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ 104 ఏళ్ల బామ్మ తన 100 ఏళ్లప్పుడే స్కై డైవింగ్ చేసింది. అయితే రికార్డు నెలకొల్పడం కోసం ఆమె రెండో సారి స్కై డైవింగ్ చేసి విజయం సాధించినట్లు తెలుస్తోంది.కాగా ఈ బామ్మ స్కై డైవింగ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది.


 
							 
							