100 ‘సలార్’ టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా రిలీజ్ నాడు మిడ్ నైట్ ఒంటిగంట షోకి 100 టిక్కెట్లు ఫ్రీగా ఇస్తానని కార్తికేయ హీరో నిఖిల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ చిత్రం కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో దీనిపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటికే ఎన్నో థియేటర్స్‌లో మొదటి రోజు టిక్కెట్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ ఆఫర్‌కి ఎగిరిగెంతేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ వీరాభిమానుల కోసం తాను 100 టిక్కెట్లు కేటాయించానని శ్రీరాములు థియేటర్‌లో డిసెంబర్ 22 అర్థరాత్రి ఒంటిగంటకు వస్తే తనతో కలిసి ఈ చిత్రం చూడవచ్చని మాటిచ్చాడు. 100 టిక్కెట్ల ధరలు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు.
