Home Page SliderNews AlertTelanganatelangana,

100 గులాబీ కార్ల ర్యాలీ..ఎందుకంటే..

తెలంగాణలో రెండుసార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సింబల్ అంబాసిడర్ కారు. గులాబీ శ్రేణులకు ఈ కారుతో ఎంతో అనుబంధం ఉంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కారులను సేకరించాడు. గత రెండు నెలలుగా సేకరించిన అంబాసిడర్ కార్లకు రిపేర్లు చేయించి గులాబీ పెయింట్ వేయించి కేసీఆర్ స్టిక్కర్లు అంటించి సిద్ధం చేశాడు. ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభకు ఈ 100 కారులను ర్యాలీగా తీసుకెళ్ళనున్నారు గులాబీ నేతలు.