కొట్టుకున్న అభిమానులు..100 మంది మృతి
ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగిన ఘర్షణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రెండు టీమ్‌ల అభిమానులు కొట్టుకోవడంతో 100 మంది దాకా మృతి చెందారు. ఈ దుర్ఘటన ఆఫ్రికాలోని గినియా దేశంలో జరిగింది. అక్కడ జెరికొరె అనే నగరంలో నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. దీనితో ఒక జట్టుకు చెందిన అభిమానులు స్టేడియంలోకి దూసుకువచ్చారు. వీరిని మరో టీమ్ అభిమానులు అడ్డుకోవడంతో వారి మధ్య కొట్లాట మొదలయ్యింది. దీనిలో వేల మంది వీధుల్లోకి వచ్చి ఘోరంగా కొట్టుకోవడం మొదలుపెట్టారు. దీనితో 100 మంది అభిమానలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.

