Breaking NewscrimeHome Page Slider

10 కేజిల బంగారం ప‌ట్టివేత‌

ముంబై ఛ‌త్ర‌ప‌తి శివాజి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి గుట్టు చ‌ప్పుడు కాకుండా వెలుప‌లికి త‌ర‌లిస్తున్న దొంగ బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు.దుబాయ్ నుంచి 10.50 కేజిల బంగారాన్ని ముంబైకి తీసుకొస్తుండ‌గా క‌స్ట‌మ్స్ అధికారులు స్మగ్ల‌ర్ల‌ను మాటు వేసి ప‌ట్టుకున్నారు.దీని విలువ భార‌తీయ మార్కెట్‌లో రూ.8.47 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.స్మ‌గ్ల‌ర్ల‌కు ఎయిర్ పోర్ట్ సిబ్బంది సైతం సాయం చేశారు.దీంతో 5గురు ఎయిర్ పోర్ట్ సిబ్బంది స‌హా మొత్తం 8 మందిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.